Homeటాప్ స్టోరీస్బాడీగార్డ్ ని...క్రూర మృగం లాగ బంధించారు.

బాడీగార్డ్ ని…క్రూర మృగం లాగ బంధించారు.

బాడీగార్డ్ ని...క్రూర మృగం లాగ బంధించారు.
బాడీగార్డ్ ని…క్రూర మృగం లాగ బంధించారు.

జనరల్ గా ఎప్పుడైనా పలానా హీరోనో, హీరోయినో ఫేమస్ అయితే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూడా ఫేమస్ అయిపోతారు. ముక్యంగా పెద్ద హీరోల దగ్గర చేసే మానేజర్ దగ్గర నుండి, బాడీ గార్డ్స్ వరకి అందరికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద హీరో ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి వారితో మాట్లాడుతారు, కలుస్తారు, మీటింగ్స్ ఏంటి అని అడుగుతారు కాబట్టి ఆ ఫేమస్ అలా పెద్దగా ఏర్పడుతుంది. ముక్యంగా బయటికి పోతే జనసంద్రాన్ని దాటాలంటే బాడీగార్డ్స్ ముఖ్యం.

అలా మన బాలీవుడ్ సుల్తాన్ “సల్మాన్ ఖాన్” బాడీ గార్డ్ ఈ రోజు వార్తల్లో నిలిచాడు, అది ఏ విధంగా అంటే….తన మాజీ సెక్యూరిటీ గార్డ్ ‘ఆనస్ ఖురేషి’.ఇతడు వీధుల్లో పడి పాదచారుల్ని కొట్టాడు.. వాహనదారుల్ని పడగొట్టాడు..రాత్రికి రాత్రి రచ్చ, రచ్చ చేశాడు. అతడి వీరంగం వీడియో నెటిజనుల్లో వైరల్ గా మారింది. అతడు అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణమేంటి? అంటే.. శ్రుతి మించి డ్రగ్స్ సేవించడమేనని తెలుస్తోంది.

- Advertisement -

అతడు కొన్ని స్టెరాయిడ్స్ ని శరీరంలోకి ఎక్కించుకొని ముంబై లోని మొరాదాబాద్ పరిసరాలకు వెళ్లాడు. అక్కడ నడిరోడ్డున పడి దారిన వస్తున్న వాహనాల్ని ఆపి…వారిని చితకబాది బాగా రచ్చ చేశాడు. అయితే అతడు పుచ్చుకున్న డ్రగ్ ప్రభావం ఎక్కువై.. ఓవర్ డోస్ వల్ల ఇలా చేశాడని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు.

అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారికి ఆ పని అంత సులువుగా అవ్వలేదు. దీంతో పోలీసులు బరిలో దిగి ఆపాలని ట్రై చేశారు. కానీ సల్మాన్ లానే దిట్టం కాబట్టి అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. దీంతో ఒక పులినో లేక క్రూర మృగాన్నో బంధించినట్టు అతడిపై వల వేసి బంధించారు. అలా బంధిస్తున్న వీడియో ఒకటి అంతర్జాలంలో రిలీజైంది. మరి అలాంటి వీడియో ఒకటి అప్లోడ్ అవుతే ఊరుకుంటారా మన వాళ్ళు చూసి చూసి లైక్స్ కొట్టి, కామెట్స్ పెట్టి వీడియో ని తెగ పాపులర్ చేసారు, పైగా మన సల్మాన్ ఖాన్ మాజీ సెక్యూరిటీ గార్డ్ కావడంతో అది కాస్తా హైలైట్ అయ్యింది.

ముంబై ఏరియా లో ఇలా జరగడం మాకు కొత్తేమి కాదు ఇప్పుడు బాడీగార్డ్ వచ్చాడు, అంతకు ముందు కూడా వేరే గుర్తు తెలియని మనుషులు వచ్చి ఇలానే తెగ అల్లర్లు చేసేవారు అని అక్కడి స్థానికులు వాపోతున్నారు.. మరి అలా జరిగినందుకు ఇక మీద ఆ ఏరియా ని ఒక కన్ను వేసి, నిఘా ఉంచాల్సిందే అని అక్కడి పోలీస్ యంత్రంగం సూచించింది అంటా.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All