
మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు అన్న వార్త బయటకు వచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో కామియో రోల్ లో సల్మాన్ ఖాన్ నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ లూసిఫెర్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఆ చిత్రంలో ప్రిథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తాడన్నమాట.
కామియో పాత్రతో పాటు మెగాస్టార్ తో ఒక సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ ను వచ్చే నెలలో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే థమన్ ఈ పాటకు ట్యూన్ ను సిద్ధం చేసేసాడట. మెగాస్టార్, సల్మాన్ ఖాన్ కలిసి నటించే సాంగ్ కు సాంగ్ కంపోజ్ చేయడం పట్ల థమన్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు.
ఇక చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు మరో రెండు సినిమాలను కూడా సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ఈరోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టింది. తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్ర పోషిస్తోంది. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 154వ చిత్రం షూటింగ్ కూడా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి గాడ్ ఫాదర్ లో మాధవన్?
మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు
రేర్ ఫీట్ తో ఆశ్చర్యపరిచిన సల్మాన్‌ఖాన్!