
కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో ప్రభాస్ సలార్ ఫై అంచనాలు భారీ గా పెరిగాయి. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కలయికలో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సలార్ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా డైరెక్టర్ డిజైన్ చేశారట. ఈ సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారన్నట్లు సమాచారం. లోయల్లో తీయబోయే భారీ ఛేజింగ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు. రాధే శ్యామ్ భారీ ప్లాప్ తో షాక్ లో ఉన్న ప్రభాస్..సలార్ తో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.