Homeటాప్ స్టోరీస్సజ్జనార్ RRR ను మాములుగా వాడుకోలే కదా..

సజ్జనార్ RRR ను మాములుగా వాడుకోలే కదా..

sajjanar special promotions with using rajamouli rrr
sajjanar special promotions with using rajamouli rrr

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్. మరో పది రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ను భారీ ఎత్తున ప్లాన్ చేసారు. తాజాగా ఎత్తార జెండా సాంగ్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సహం నింపారు. ఈ సినిమాకు సంబదించిన ఏ అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ను వాడుకోవడం మొదలుపెట్టారు టిఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సజ్జనార్ ..తన మార్క్ చూపిస్తున్నాడు. అందరిలా వచ్చి బాధ్యత చేశామా..అని కాకుండా తనకంటూ చరిత్రలో ఓ పేజీ ఉండాలని సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. వామ్మో ఆర్టీసీ బస్సా…అని అనుకున్నవారంతా ఇప్పుడు ఆర్టీసీ బస్ అయితేనే ప్రయాణం చేద్దాం అనుకునేలా ప్రయాణికుల్లో మార్పు తీసుకొచ్చారు. ప్రవైట్ ట్రావెల్స్ తలదన్నేలా సరికొత్త ఆఫర్స్ ప్రకటిస్తూ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ను , అగ్ర హీరోల తాలూకా సినిమాలను బాగా వాడుతున్నారు.

- Advertisement -

తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి వచ్చిన ఎత్తార జెండా సాంగ్ ను గట్టిగా వాడుకున్నారు. RRR అంటే రాష్ట్ర రోడ్డు రవాణా అని డిఫైన్ చేసిన సజ్జనార్.. ‘ఎత్తర జెండా’ పాటను ఎడిట్ చేసిన తీరు నెటిజన్ల చేత వావ్! అనిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ TSRTC జెండాను ఎత్తుతున్నట్లుగా చూపించిన సీన్ ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ధటీజ్ సజ్జనార్.. సూపర్ క్రియేటివిటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All