Homeటాప్ స్టోరీస్రిలీజ్ కి ముందే పది కోట్ల లాభమట

రిలీజ్ కి ముందే పది కోట్ల లాభమట

sailaja reddy alludu in table profitఅక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా మారుతి దర్శకత్వంలో ”శైలజా రెడ్డి అల్లుడు ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . నాగచైతన్య సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రంలో శైలజా రెడ్డి గా ఒకప్పటి హాట్ భామ రమ్యకృష్ణ నటించింది . తెలుగునాట అత్తా – అల్లుడు నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ దాదాపుగా సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో ఈ చిత్రానికి కూడా ఫుల్ బజ్ వచ్చేసింది . దాంతో ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు పోటీపడగా మంచి రేట్ల కు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రానికి 23 కోట్ల వరకు ఖర్చు కాగా రిలీజ్ కి ముందే 30 నుండి 35 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట !

అంటే విడుదలకు ముందే దాదాపు పది కోట్ల లాభమన్నమాట . భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇలా టేబుల్ ప్రాఫిట్ అందించడం లేదు కానీ శైలజా రెడ్డి అల్లుడు మాత్రం విడుదలకు ముందే లాభాలు తెచ్చి పెట్టడంతో ఆ సినిమా నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారట . ఇక ఈ సినిమాని ఆగస్టు 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నాగార్జున నటించిన ” అల్లరి అల్లుడు ” తరహాలో ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుందట ఈ శైలజా రెడ్డి అల్లుడు చిత్రం . నాగచైతన్య కు అత్తగా రమ్యకృష్ణ నటిస్తుండటం తో తెరమీద కలర్ ఫుల్ గా ఉండటం ఖాయం .

- Advertisement -

English Title: sailaja reddy alludu in table profit

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All