ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు ప్లాప్ లు అది కూడా మామూలు ప్లాప్ చిత్రాలు కాదు నాలుగు చిత్రాలైతే డిజాస్టర్ లుగా తేలాయి , పరమ చెత్త చిత్రాలుగా నిలిచాయి . అయిదు ప్లాప్ లను అందుకుని దిమ్మ తిరిగిన హీరో ఎవరో తెలుసా ……… మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . తాజాగా ఈ హీరో నటించిన ఇంటలిజెంట్ చిత్రం కూడా డిజాస్టర్ బారిన పడింది . వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటలిజెంట్ నిన్న రిలీజ్ అయ్యింది . అయితే కమర్షియల్ చిత్రాల దర్శకుడు వినాయక్ కావడంతో కొద్దిగా నైనా బాగుంటుందేమో అని అనుకున్నారు కానీ అటు మెగా మేనల్లుడి కెరీర్ లోనే కాదు వినాయక్ కెరీర్ లో కూడా డిజాస్టర్ గా తేలిపోయింది ఇంటలిజెంట్ .
అంతకుముందు తిక్క , విన్నర్ , నక్షత్రం , చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందాయి అయితే గుడ్డిలో మెల్ల లాగా జవాన్ కొంతవరకు బెటర్ వీటిలా డిజాస్టర్ మాత్రం కాలేదు . ఇలా వరుస దెబ్బలు తగలడంతో మెగా మేనల్లుడు లో కొంచెం కదలిక వచ్చిందట ! ఇకపై చాలా జాగ్రత్తగా కథల ఎంపిక ఉండాలని లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నాడట . ఇంటలిజెంట్ ఇచ్చిన షాక్ తో జాగ్రత్తలు తీసుకుంటాడా ? లేదా ? చూడాలి .