
డిజాస్టర్ దర్శకుడిగా ముద్రపడిన దేవా కట్టా దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . దేవా కట్టా ప్రస్థానం చిత్రంతో తన ప్రత్యేకత ని నిరూపించుకున్నాడు . మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు కానీ ఆ తర్వాత మంచు విష్ణు తో చేసిన డైనమైట్ అడ్డదిడ్డంగా పేలిపోయి దేవా కట్టా ని ఇబ్బంది పెట్టింది .
అంతకుముందు ఆటోనగర్ సూర్య ప్లాప్ అయ్యింది పైగా బడ్జెట్ ఎక్కువ కావడం , సినిమా ఆలస్యం కావడంతో అది డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది . దాంతో ఈ దర్శకుడితో సినిమా అంటే భయపడిపోతున్నారు . ఆలోచన పరంగా దేవా కట్టా మంచి దర్శకుడే కానీ బడ్జెట్ అలాగే ప్లానింగ్ దానికి తోడు కమర్షియల్ హిట్ అయితేనే విలువ …….. లేకపోతే అంతేగా ! దేవా కట్టా చెప్పిన కథ నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట సాయిధరమ్ తేజ్ . అసలే ఈ హీరోకు సక్సెస్ లేదు ఇలాంటి సమయంలో దేవా తో సినిమా అంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్లే !