Homeటాప్ స్టోరీస్చిత్రలహరి తోనైనా హిట్ కొడతారా ?

చిత్రలహరి తోనైనా హిట్ కొడతారా ?

Saidharam tej and sunil waiting for successసాయి ధరమ్ తేజ్ , సునీల్ , కళ్యాణి ప్రియదర్శన్  , నివేదా పేతురాజ్ లు నటించిన చిత్రం ” చిత్రలహరి ” . కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది . ఏప్రిల్ 12న రిలీజ్ కానున్న చిత్రలహరి టీజర్ ని ఈరోజు హైదరాబాద్ లో రిలీజ్ చేసారు . వినోద ప్రధానంగా రూపొందిన చిత్రలహరి టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది .

 

- Advertisement -

అయితే సాయి ధరమ్ తేజ్ కు గతకొంత కాలంగా హిట్స్ లేవు . వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి దాంతో చిత్రలహరి పై ఆశలు పెట్టుకున్నాడు , అలాగే సునీల్ కూడా హీరోగా ఘోర పరాజయాలను చవిచూశాడు దాంతో దిమ్మతిరిగిన సునీల్ మళ్ళీ కామెడీ వేషాలు వేస్తున్నాడు . ఈ ఇద్దరు కూడా హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు . ఈ ఇద్దరికి చిత్రలహరి విజయాన్ని అందిస్తుందా ? లేదా ? చూడాలి . ఏప్రిల్ 12న ఆ విషయం తేలిపోద్ది .

English Title : Saidharam tej and sunil waiting for success

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All