Homeటాప్ స్టోరీస్యాక్షన్ రూట్లోకి వెళతానంటోన్న యంగ్ మెగా హీరో

యాక్షన్ రూట్లోకి వెళతానంటోన్న యంగ్ మెగా హీరో

యాక్షన్ రూట్లోకి వెళతానంటోన్న యంగ్ మెగా హీరో
యాక్షన్ రూట్లోకి వెళతానంటోన్న యంగ్ మెగా హీరో

యంగ్ మెగా హీరో సాయి తేజ్ కు 2019 భలే కలిసొచ్చింది. వరసగా ఆరు డిజాస్టర్ల తర్వాత 2019లో రెండు హిట్స్ కొట్టాడీ సుప్రీమ్ హీరో. చిత్రలహరి సినిమా తన ప్లాపుల పరంపరకు బ్రేకులు వేస్తే గతేడాది వచ్చిన ప్రతిరోజూ పండగే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పెట్టిన పెట్టుబడికి రెండు రెట్ల లాభాలు ఆర్జించి పెట్టింది. ఈ రేంజ్ హిట్ రావడంతో తేజ్ కెరీర్ మళ్ళీ గాడిన పడ్డట్లే. తన మార్కెట్ మళ్ళీ వచ్చేసినట్లే. పాతిక కోట్ల హీరో క్లబ్ లో మళ్ళీ తేజ్ కు స్థానం దక్కింది. ప్రతిరోజూ పండగే చిత్రం చేస్తున్న సమయంలోనే తేజ్ సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రాన్ని కమిటైన విషయం తెల్సిందే.

నన్ను దోచుకుందువటే చిత్రానికి అసిస్టెంట్ గా చేసిన సుబ్బు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నభ నటేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సోలో బ్రతుకే సో బెటరు చిత్రాన్ని ఏప్రిల్ 24 లేదా మే 1న విడుదల చేయాలని భావిస్తున్నారు. బడా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెల్సిందే.

- Advertisement -

ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా తన స్థాయిని చాటుకున్న దేవా కట్టా నుండి ఇంత వరకూ ఆ స్థాయి సినిమా రాలేదు. నిఖార్సైన కమర్షియల్ హిట్ లేని ఈ దర్శకుడ్ని ఈ మెగా హీరో బలంగా నమ్ముతున్నాడు. దీనికి కారణం కూడా ఉంది. చాలా కాలం నుండి తేజ్ ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నాడు. దేవా కట్టా చెప్పిన కథ ఇదే జోనర్ లో ఉండడమే కాకుండా థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయిట. అందుకే దేవా కట్టా ట్రాక్ రికార్డ్ పట్టించుకోకుండా తన టాలెంట్ కే ఓటు వేసాడు. ఏప్రిల్ లో ఈ సినిమా లాంచ్ ఉంటుంది. భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మరో నెలలో మొదలయ్యే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All