
భానుమతి హైబ్రీడ్ పిల్ల అంటూ `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పక్కింటి అమ్మాయిలా ఫిదా చేసింది. నేచురల్ యాక్టర్‌గా ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం `విరాటపర్వం`. రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు ఆస్కారం వున్న ఫోక్ సింగర్‌గా కనిపించబోతోంది.
ఈ మూవీతో పాటు శేఖర్ కమ్ముల `లవ్‌స్టోరీ`లోనూ నటిస్తున్న సాయి పల్లవికి తాజాగా ఓ బంపర్ ఆఫర్ లభించినట్టు తెలిసింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ హిట్ ఫిల్మ్ `వేదాలం` రీమేక్‌లో సాయి పల్లవి నటించే అవకాశం వుందని వార్తలు వినిపించాయి.
అయితే ఆ పాత్రలో సాయి పల్లవి కంటే కీర్తి సురేష్ బెస్ట్ అని భావించిన చిరు ఫైనల్‌గా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేశారట. దీంతో సాయి పల్లవిని పవన్ మూవీ కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`ని పవన్‌తో రీమేక్ చేయబోతున్న విషయంమ తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్న ఈమూవీలో పవన్‌కు జోడీగా సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం.