Homeటాప్ స్టోరీస్స్టేజ్‌పై రౌడీ బేబీ హంగామా!

స్టేజ్‌పై రౌడీ బేబీ హంగామా!

స్టేజ్‌పై రౌడీ బేబీ హంగామా!
స్టేజ్‌పై రౌడీ బేబీ హంగామా!

సాయి ప‌ల్ల‌వి.. డ్యాన్స్‌లో గ్రేస్ ఈమె సొంతం . ఎలాంటి డ్యాన్స్‌నైనా త‌న‌దైన స్టైల్లో ర‌క్తిక‌ట్టించి ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డంతో సాయి ప‌ల్ల‌వి ప్ర‌త్యేక‌తే వేరు. `ఎంసీఏ`లో  `ఏమండోయ్ నాని గారూ..` అంటూ సాగే పాట‌లో హీరో డామినేట్ చేసే స్థాయిలో స్టెప్పులేసి అద‌ర‌గొట్టింది సాయి ప‌ల్ల‌వి. ఇక రికార్డు సాయిలో `రౌడీ బేబీ పాట‌కి దుమ్ము దులిపేసింద‌ని చెప్పొచ్చు.

ధ‌నుష్ న‌టించిన `మారి -2` చిత్రంలోని ఈ పాట‌లో ధ‌నుష్‌ని త‌న స్టెప్పుల‌తో సాయి ప‌ల్ల‌వి డామినేట్ చేసింది. డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్ర‌భుదేవానే ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయ్యాడంటే ఆమె డ్యాన్స్ ఏ స్థాయిలో  ర‌చ్చ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. 2019లో అత్య‌‌ధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా రౌడీ బేబీ యూట్యూబ్‌లో చ‌రిత్ర సృష్టించింది.

- Advertisement -

ఇదే పాట‌కు ఇటీవ‌ల ఓ అవార్డు ఫంక్ష‌న్‌లో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో పాటు త‌మిళ కీల‌క న‌టులు చూస్తున్న వేళ స్టేజ్‌పై రౌడీ బేబీ సాంగ్‌కు ర‌చ్చ చేయ‌డం విశేషం. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బ‌య‌టికి వ‌చ్చి వైర‌ల్‌గా మారింది. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం రానాతో `విరాట‌ప‌ర్వం`, నాగ‌చైత‌న్య‌తో `ల‌వ్‌స్టోరీ` చిత్రాల్లో న‌టిస్తోంది. నాని హీరోగా తెర‌పైకి రాబోతున్న `శ్యామ్ సింగ్ రాయ్‌`లోనూ సాయి ప‌ల్ల‌వి న‌టించే అవ‌కాశం వంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All