Homeటాప్ స్టోరీస్రాజమౌళి బొమ్మరిల్లు ఫాదర్ లా ఇబ్బంది పెడుతున్నాడా?

రాజమౌళి బొమ్మరిల్లు ఫాదర్ లా ఇబ్బంది పెడుతున్నాడా?

రాజమౌళి బొమ్మరిల్లు ఫాదర్ లా ఇబ్బంది పెడుతున్నాడా?
రాజమౌళి బొమ్మరిల్లు ఫాదర్ లా ఇబ్బంది పెడుతున్నాడా?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి జక్కన్న అనే పేరున్న విషయం తెల్సిందే. ప్రతి సన్నివేశాన్ని శిల్పం చెక్కినట్లు పెర్ఫెక్ట్ గా వచ్చేదాకా చెక్కుతాడు కాబట్టే అందరూ రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలుస్తారు. అయితే ఇప్పుడు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాత్రం రాజమౌళిని బొమ్మరిల్లు ఫాదర్ ని సంభోదిస్తున్నాడు. బొమ్మరిల్లు సినిమా చూస్తే అందులో ఫాదర్ క్యారెక్టర్ వేసిన ప్రకాష్ రాజ్, తన కొడుకు అయిన సిద్ధార్థ్ కు ఏం కావాలో అడగడు, తనకి ఏది అవసరమో అంతకు మించి ఇచ్చేలా చూసుకుంటాడు. అంతేకాకుండా తన కొడుక్కి ఆఫీస్ పని ఒకటి చెప్పి అది కొడుకు పూర్తి చేయాలని వెళ్లే లోపే ఆ పని పూర్తి చేసేస్తుంటాడు. అవతలి వ్యక్తి గురించి పట్టించుకోకుండా అతి ప్రేమను కురిపించేవాళ్లను అప్పటినుండి బొమ్మరిల్లు ఫాదర్ లా చేయకురా అనడం సాధారణమైపోయింది. అయితే ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా ఏ సెన్స్ లో రాజమౌళిని బొమ్మరిల్లు ఫాదర్ అన్నాడు? విషయంలోకి వెళితే చాలా పాజిటివ్ సెన్స్ లోనే సాయి మాధవ్ ఈ రకంగా వ్యాఖ్యానించాడు. ఇప్పటికే రాజమౌళి తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ గురించి పలు సందర్భాల్లో మాట్లాడిన బుర్రా చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ కు సాయి మాధవ్ బుర్రా మాటల రచయితగా పనిచేస్తున్న విషయం తెల్సిందే.

ఒకానొక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి ఇప్పటికే చాలాసార్లు తన మదిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసేసి ఉంటాడు. తన మదిలో ఉన్న దాన్ని తెరమీదకు తెచ్చే ప్రయత్నమే జరుగుతోందిట. ఏ డైలాగ్ ఎంత లెంగ్త్ ఉండాలో, ఎలాంటి సందర్భంలో ఎలాంటి డైలాగ్ రావాలో మొత్తం రాజమౌళి దగ్గర లెక్క ఉంటుందిట. అందుకే రచయిత పని సగం తగ్గిపోతుంది అంటున్నాడు. ఆయన చెప్పింది అర్ధం చేసుకుని దాని ఆత్మ పట్టుకోగలిగితే రాజమౌళితో పనిచేయడం చాలా సులువని అంటున్నాడు. అందుకే దీన్ని ఇబ్బంది పెట్టడంలో చూడకూడదట. సినిమాను రాజమౌళి అంతలా ప్రేమిస్తాడట. సినిమా పెర్ఫెక్ట్ గా రావడానికి అంత కష్టపడతాడట రాజమౌళి.

- Advertisement -

ఇటీవలే మరో ఇంటర్వ్యూలో పాటల రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ బాహుబలి చిత్రంలో పచ్చ బొట్టేసిన పాట రాయడానికి రాజమౌళి ఎంత సహకరించాడో చెప్పుకొచ్చాడు. ఆ పాటలో ఏ సందర్భంలో ఎలాంటి లైన్ వస్తుందో స్కెచ్ తో సహా తనకు ఇచ్చాడని, పాటను మొత్తం ముందే మైండ్ లో రాజమౌళి ఊహించేసుకున్నాడని అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యానించాడు.

ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా కానీ సందర్భానికి తగినట్లు సంభాషణలు ఉంటాయి తప్ప హీరోయిజం ఎలివేట్ చేయడానికంటూ ప్రత్యేకంగా ఏం ఉండవని సాయి మాధవ్ బుర్రా వ్యాఖ్యానించాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All