Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్`‌కు డేట్ ఫిక్స్‌!

`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్`‌కు డేట్ ఫిక్స్‌!

`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్`‌కు డేట్ ఫిక్స్‌!
`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్`‌కు డేట్ ఫిక్స్‌!

సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. చిత్రీకర‌ణ పూర్తయింది. గ‌త ఏడు నెల‌లుగా ఈ మూవీ రిలీజ్‌కి ఎదురుచూస్తోంది. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. తాజాగా రిలీజ్ డేట్‌ని కూడా చిత్ర బృందం ప్ర‌క‌టించేసింది.

- Advertisement -

విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్నారు. అదీ థియేట‌ర్స్‌లో. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్స్ రీఓపెన్ అవుతున్న నేప‌థ్యంలో టాలీవుడ్ లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమాగా `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` నిల‌వ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ `ప్రేక్ష‌కుల కేరింత‌లు.. విజిల్స్ విన‌డానికి ఎదురుచూస్తున్నారు. సాధార‌ణ వాతావ‌ర‌ణంలో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా కావ‌డం గ‌ర్వంగా వుంది` అన్నారు.

ఇన్ని రోజులు మ‌నం ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నామో మ‌న‌కు తెలుసు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేము సిద్ధంగా వున్నాం. క్రిస్మ‌స్ కు మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికి అన్ని ఎమోష‌న్స్ వున్న ఫుల్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని డిసెంబ‌ర్ 25న అందించ‌బోతున్నాం`అని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts