Homeటాప్ స్టోరీస్ఇంతకీ రిపబ్లిక్ ఫేట్ ఏంటి?

ఇంతకీ రిపబ్లిక్ ఫేట్ ఏంటి?

ఇంతకీ రిపబ్లిక్ ఫేట్ ఏంటి?
ఇంతకీ రిపబ్లిక్ ఫేట్ ఏంటి?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు. అతని నుండి వచ్చిన రీసెంట్ చిత్రం రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదలై డీసెంట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని దేవా కట్టా తెరకెక్కించాడు. అందరికంటే ఈ సినిమా హిట్ అవ్వడం అనేది అతనికే ముఖ్యం. ఎందుకంటే దాదాపు అందరూ దేవా కట్టాను మర్చిపోయిన తరుణంలో చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి తీసిన చిత్రం ఇది.

దురదృష్టవశాత్తూ సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాడు. అయితే దేవా కట్టా అన్నీ తానై ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసాడు. సోషల్ మీడియాలో కూడా ప్రతీ పాజిటివ్ కామెంట్ కు స్పందించి చిత్రాన్ని ప్రజలకు చేరువ చేయడానికి శాయశక్తులా కృషి చేసాడు.

- Advertisement -

అయితే ప్రస్తుతం రిపబ్లిక్ ఫుల్ రన్ కు చేరువైందని చెప్పవచ్చు. తొలి వీకెండ్ లో ఈ చిత్రం 4.5 కోట్ల షేర్ దాకా వసూలు చేసి పర్వాలేదనిపించుకుంది. అయితే వీక్ డేస్ లో బాగా డ్రాప్ అయిన ఈ చిత్రం మొత్తంగా తొలి వారానికి 6.5 కోట్ల షేర్ ను సాధించింది. రెండో వీకెండ్ లో కూడా రిపబ్లిక్ పెద్దగా సాధించింది ఏం లేదు. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్ కు చేరువైందని అనుకోవచ్చు. మొత్తంగా రిపబ్లిక్ 7 కోట్ల షేర్ ను సాధించింది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ ఫిగర్ లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. 12 కోట్లకు థియేట్రికల్ రైట్స్ ను అమ్మారు నిర్మాతలు. మొత్తం థియేట్రికల్ రైట్స్ ను జీ సంస్థ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు ఇతర రైట్స్ అన్నీ కలుపుకుని లాభాలను అందుకున్నట్లే. ఇక జీ సంస్థ త్వరలోనే చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలనుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All