Sunday, December 4, 2022
HomeINTERVIEWSవ్య‌క్తిగ‌తంగా నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా ఇది - సాయి తేజ్‌

వ్య‌క్తిగ‌తంగా నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా ఇది – సాయి తేజ్‌

వ్య‌క్తిగ‌తంగా నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా ఇది - సాయి తేజ్‌
వ్య‌క్తిగ‌తంగా నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా ఇది – సాయి తేజ్‌

సాయితేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌భ న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న క్రిస్మ‌స్ కానుకగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. లాక్‌డౌన్ త‌రువాత థియేట‌ర్ల‌లో విడుద‌లౌతున్న తొలి తెలుగు సినిమాగా ఈ చిత్రం రికార్డు సాధించ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా హీరో సాయి తేజ్ బుధ‌వారం మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఆ విశేషాలు ఇవి.

- Advertisement -

ఈ మూవీతో యూత్‌కి ఏం చెప్ప‌బోతున్నారు?

మ‌న ఫ్రీడ‌మ్ కొంత వ‌ర‌కు మ‌న త‌ల్లిదండ్రులు చేతుల్లో వుంటుంది. మ‌నం ఏం చేయాలి? .. ఏం చ‌దువుకోవాలి. కొంత మంది ప్రేమ‌లో ప‌డితే వారు చెప్పిన‌ట్టు వినాల్సి వుంటుంది. పిల్ల‌లు పుట్టాక వాళ్ల గురించి ఆలోచించ‌డం చేస్తుంటాం. ఇలా మ‌న ఫ్రీడం ఎప్పుడూ మ‌న చేతుల్లో వుండ‌దు. మ‌న‌కిచ్చిన ఫ్రీడ‌మ్‌ని మ‌నం అనుకున్న విధంగా వినియోగించుకోవాల‌న్నది ఈ చిత్రంలో చెబుతున్నాం. సంతోషంగా వుండాలంటే సింగిల్‌గా వుండాల‌ని నిశ్చ‌యించుకున్న హీరో త‌ను న‌మ్మిన ఫిలాస‌ఫీ కార‌ణంగా ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు. వాట‌న్నింటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అన్న‌దే ఈ చిత్ర క‌థ‌.

పెళ్లి వ‌ద్ద‌నే కాన్సెప్ట్ మీద ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి. వాట‌న్నింటితో పోలిస్తే ఈ మూవీ ఏవిధంగా కొత్త‌గా వుంటుంది?

గ‌తంలో వ‌చ్చిన చిత్రాల‌కు భిన్నంగా అంటూ ఏమీ వుండ‌దు కానీ మాన‌వ సంబంధాల ప‌రంగా, హ్యుమ‌న్ ఎమోష‌న్స్ ప‌రంగా మాత్రం కొత్త‌గా వుంటుంది.

పెళ్లి విష‌యంలో మీకు ఎంత వ‌ర‌కు వెసులుబాటు ల‌భించింది?

లాక్‌డౌన్ కార‌ణంగా ఏడాదిన్న‌ర కాలం క‌లిసొచ్చింది. ఈ టైమ్ పూర్తి కావ‌స్తోంది. మ‌ళ్లీ ఏడాది పాటు పెళ్లిని పోస్ట్ పోన్ చేసేందుకు మ‌ళ్లీ టైమ్ తీసుకోవాలి. త‌మ‌న్‌తో ఇది ఐద‌వ సినిమా. నో పెళ్లి.. హే ఇది నేనేనా.. అమృత‌.. మొన్న విడుద‌లైన టైటిల్ సాంగ్.. ఇలా అన్ని పాట‌ల‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ ల‌భించింది.

సింగిల్స్ అంథెమ్ త‌రువాత రానాకి.. నితిన్‌కి పెళ్లి చేసిన‌ట్టున్నారు?

సింగిల్స్ అంథెమ్‌ని నితిన్ కి గిఫ్ట్‌గా అనుకున్నాం. త‌న‌కు సంబంధించిన బ్యాచిల‌ర్స్ పార్టీలో లేదా సంగీత్‌లో ప్లేచేయోచ్చ‌ని అనుకున్నాం. కానీ అనుకోకుండా అంద‌రికి పెళ్లిళ్లైపోయాయి. దీంతో ఈ పాట రానా, నితిన్‌, నిఖిల్‌ల‌కు క‌లిసొచ్చింది.

మీ మూవీతో మ‌ళ్లీ ఇండ‌స్ట్రీ మొద‌లౌతోంది. ఇలాంటి స‌మ‌యంలో క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ ఎంత వ‌ర‌కు సేఫ్ అనుకుంటున్నారు?

సినిమాపై మాకు న‌మ్మ‌కం వుంది కాబ‌ట్టి ప్రాప‌ర్‌గా ప్ర‌మోట్ చేయ‌గ‌లుగుతున్నాం. థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి ముందుకొస్తున్నామంటే మూవీ కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా వుంది కాబ‌ట్టి. ఇదొక మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌. లాక్‌డౌన్‌లో థ్రిల్ల‌ర్‌లు చూస్తూ వ‌చ్చాం. కానీ ప్రాప‌ర్ తెలుగు ఎంట‌ర్‌టైన‌ర్‌ని చూడ‌లేదు. ఫ్యామిలీ అంతా క‌లిసి సోష‌ల్ డిస్టెంన్స్ కి సంబంధించిన నిబంధ‌న‌లు పాటిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తార‌నుకుంటున్నా. క‌లెక్ష‌న్స్ గురించి ఆలోచ‌న లేదు. ప‌బ్లిక్ సేఫ్టీ చాలా ముఖ్యం క‌లెక్ష‌న్‌ల గురించి ఆలోచించ‌డం లేదు. ప్రొడ్యూస‌ర్స్ ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ విష‌యంలో సేఫ్‌గా వున్నారు. వారంతా ప్ర‌స్తుతం హ్యాపీగా వున్నారు. సోష‌ల్ డిస్టెన్స్‌ని పాటిస్తూ జ‌నం థియేట‌ర్ల‌కి వ‌స్తే నాకు అదే చాలు. క‌లెక్ష‌న్స్ క‌న్నా అదే నాకు ముఖ్యం.

ఈ మూవీకి వ‌చ్చే రెస్పాన్స్‌ని బ‌ట్టి మిగ‌తా సినిమాలుకు మ‌రింత ఉత్సాహం ల‌భిస్తుంది. ఈ విష‌యంలో మీరేం అనుకుంటున్నారు?

ఈ విష‌యంలో బాధ్య పెరిగింది అనుకుంటున్నాను. ఓ న‌టుడిగా.. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తిగా నాపై మ‌రింత బాధ్య‌త పెరిగింది. గ‌త ఏడాది జూన్‌లో సుబ్బు ఈ చిత్ర క‌థ వినిపించాడు. అప్ప‌టి నుంచి త‌ను వ‌ర్క్ చేస్తూ వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో నేను `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రీక‌ర‌ణ‌లో వున్నాను. గ‌త ఏడాది ఇదే నెల‌లో `ప్ర‌తిరోజు పండ‌గే`తో హిట్‌ని సొంతం చేసుకున్నాను. మ‌ళ్లీ అదే నెల ఈ సినిమాతో వ‌స్తున్నాను. ఇలా కుద‌ర‌డం దేవుడి ద‌య అనుకుంటున్నాను. మంచి సినిమా విడుద‌లైతే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా థియేట‌ర్ కు వ‌స్తార‌న్న కాన్ఫిడెన్స్ వ‌ల్లే ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని స్ట్రాంగ్‌గా అనుకున్నాం. సినిమా ఆడితే ఇండ‌స్ట్రీకి చిన్న రిలీఫ్ ల‌భిస్తుంద‌ని చిన్న ఆశ‌. అందుకోస‌మే ఫైట్ చేస్తున్నాను.

మీ నిజ‌జీవితానికి ఈ మూవీ ఎంత వ‌ర‌కు ద‌గ్గ‌ర‌గా వుంటుంది?

వ్య‌క్తిగ‌తంగా నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా ఇది. చిత్ర‌ల‌హ‌రి నుంచి వ్య‌క్త‌గ‌తంగా నా మ‌న‌స్త‌త్వానికి ద‌గ్గ‌ర‌గా వుండే క‌థ‌లే వ‌స్తున్నాయి. స‌క్సెస్ కోసం ఫైట్ చేసే ఓ యువ‌కుడి క‌థ చిత్ర‌ల‌హ‌రి, త‌న గ్రాండ్ ఫాద‌ర్ కోసం త‌పించే కుర్రాడి క‌థ `ప్ర‌తి రోజు పండ‌గే`. ఇక `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`లో పెళ్లి వ‌ద్దని వాదించే ఓ యువ‌కుడి క‌థ‌ని ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని మిక్స్ చేసి రూపొందించాం.

ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్స్‌కి ర‌ప్పించ‌డానికి ఏం చేయ‌బోతున్నారు?

ఇంత‌కు ముందు ప్ర‌సాద్స్ థియేట‌ర్స్‌కి వెళ్లి థియేట‌ర్స్‌కి రండి అని చెప్పాను. లాస్ట్ సాంగ్ ని కూడా థి‌యేట‌ర్‌లోనే రిలీజ్ చేశాం. థియేట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ అన్న‌ది మ‌న జీన్స్‌లోనే జీర్ణించుకుపోయింది. కాలేజ్ బంక్ కొట్టి థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూడాల‌నుకుంటాం. క్రికెట్ మ్యాచ్ అయ్యాక సాయంత్రం సర‌దాగా సినిమాకి వెళ్లాల‌నుకుంటాం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటాం. అది మ‌న జీవితాల్లో వుంది.  అలాంటి సినిమా థియేట‌ర్స్‌కి క‌ష్ట‌కాలం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం స‌పోర్ట్‌గా నిల‌బ‌డ‌టం మ‌న బాధ్య‌త‌. దాన్ని నేను ఫీల‌య్యాను కాబ‌ట్టే థియేట‌ర్స్‌కి రండ‌నే నినాదాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం రైట్ అనిపించింది.  ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోని సుద‌ర్శ‌న్ 35లో చూడ‌బోతున్నాను.

దేవా క‌ట్టాతో చేస్తున్న మూవీ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?

60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మేజ‌ర్ పార్ట్ షూటింగ్ అంతా అయిపోయింది. అవుట్ డోర్ షూటింగ్ బ్యాలెన్స్‌గా వుంది. ఏలూరుతో పాటు కొల్లేరులోనూ షూట్ చేయ‌బోతున్నాం. దీనితో పాటు సుకుమార్ గారి శిష్యుడు కార్తీక్ దండుతో ఓ మూవీ చేస్తున్నాను. వ‌చ్చే ఏడాది రెండు చిత్రాలు రిలీజ్ కావాల‌నుకుంటున్నాను.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts