Homeటాప్ స్టోరీస్త‌మ్ముడి సెట్‌లో అన్న హంగామా!

త‌మ్ముడి సెట్‌లో అన్న హంగామా!

త‌మ్ముడి సెట్‌లో అన్న హంగామా!
త‌మ్ముడి సెట్‌లో అన్న హంగామా!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ హిట్ బాట ప‌ట్టారు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. తాజాగా ఆయ‌న న‌టించిన `ప్ర‌తిరోజు పండ‌గే` డిసెంబ‌ర్‌లో విడుద‌లై భారీ విజ‌యాన్నిసాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద సాయిధ‌ర‌మ్‌తేజ్ మార్కెట్‌ని మ‌రింత పెంచి భారీ వ‌సూళ్ల‌ని సాధించింది. సాయి కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో అమితానందంలో వున్న ఈ హీరో తాజాగా త‌మ్ముడి సినిమా సెట్‌లో హంగామా చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్‌తేజ్ `ఉప్పెన‌` చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన బుచ్చిబాబు సాన ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ముందు ఈ చిత్రానికి `జాల‌రి` అనే టైటిల్‌ని అనుకున్నారు. అయితే దాన్ని ప‌క్క‌న పెట్టి `ఉప్పెన‌` టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు.

- Advertisement -

ఇటీవ‌ల ఈ చిత్ర హీరో వైష్ణ‌వ్‌తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ `ఉప్పెన‌` సెట్‌లో సంద‌డి చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. త‌న త‌మ్ముడి ప్ర‌తి ఎదుగుద‌ల‌లోనూ ఆ దేవుడి ఆశీస్సులు వుండాల‌ని కోరుకుంటూ సాయిధ‌మ్‌తేజ్ పెట్టిన పోస్ట్‌, త‌మ్ముడిని త‌న భుజాపై ఎక్కించుకుని దిగిన ఫొటో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటోంది.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All