Homeటాప్ స్టోరీస్మెగా మేనల్లుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్టేనా?

మెగా మేనల్లుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్టేనా?

మెగా మేనల్లుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్టేనా?
మెగా మేనల్లుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్టేనా?

స్టార్ వారసులకు సినిమా డెబ్యూ చాలా ఈజీగా అయిపోతుంది అనుకుంటారు కానీ సాయి ధరమ్ తేజ్ తన డెబ్యూ సినిమా కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొదట రేయ్ సినిమా చేసినా ఆ సినిమా విడుదలవ్వడానికి దాదాపు 4 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. ఏ హీరోకైనా ఇలా సినిమా విడుదల కాకుండా వాయిదా పడుతుండడం అన్నది చాలా వేదన. అయితే ఈ బాధ కొంత తగ్గించడానికి అన్నట్లుగా తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్ కన్నా ముందు విడుదలై మంచి హిట్టైంది. ఆ తర్వాత రేయ్ వచ్చి ప్లాప్ అయినా కానీ వెంటనే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాలతో తేజ్ మార్కెట్ బాగా పుంజుకుంది. యువ హీరోల్లో బెస్ట్ ఆప్షన్ గా నిలిచాడు.

అయితే తేజ్ కెరీర్ ఆ తర్వాత భారీ కుదుపులకు లోనైంది. రెండు, మూడేళ్లపాటు హిట్ అనే మాటే వినపడలేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు తేజ్ వి వచ్చినట్లే వచ్చి పోయాయి. అన్ని సినిమాలు వరసగా పోవడమంటే మాటలు కాదు. అందులో ఒక యువ హీరో దాన్ని తట్టుకోవడం కష్టం. అయితే తేజ్ నిలబడ్డాడు. ఈ క్రమంలో తన మార్కెట్ అంతా కోల్పోయినా ఎక్కడా అధైర్యపడలేదు. సుప్రీమ్ సినిమా ద్వారా 25 కోట్ల మార్కెట్ సంపాదించుకున్న తేజ్, ఆరు వరస డిజాస్టర్ల తర్వాత బాగా డౌన్ అయిపోయాడు. దాదాపు 15 కోట్ల మేర మార్కెట్ ను కోల్పోయాడు.

- Advertisement -

అయితే ఈ ఏడాది తేజ్ కు బౌన్స్ బ్యాక్ ఇయర్ అని చెప్పవచ్చు. సాయి ధరమ్ తేజ్ నుండి సాయి తేజ్ గా మారిన తర్వాత ఈ హీరోకి బాగానే కలిసొచ్చింది. చిత్రలహరి వరస ప్లాపులకు బ్రేక్ వేస్తె ప్రతిరోజూ పండగే సినిమా తన మార్కెట్ ను తిరిగి సంపాదించి పెట్టింది. ఈ సినిమా 10 రోజుల్లోనే 25 కోట్ల షేర్ సంపాదించుకుని సూపర్ హిట్ అయింది. దీంతో కోల్పోయింది మొత్తం తేజ్ ఈ ఏడాది తిరిగి సంపాదించుకోగలిగాడు అని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All