Homeటాప్ స్టోరీస్పిల్లా నువ్వు లేని జీవితం - ప్రతిరోజూ పండగే తేజు@5 ఇయర్స్

పిల్లా నువ్వు లేని జీవితం – ప్రతిరోజూ పండగే తేజు@5 ఇయర్స్

పిల్లా నువ్వు లేని జీవితం - ప్రతిరోజూ పండగే తేజు@5 ఇయర్స్
పిల్లా నువ్వు లేని జీవితం – ప్రతిరోజూ పండగే తేజు@5 ఇయర్స్

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. హీరోగా అరంగేట్రం చేసినప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోలికలు ఉన్నాయని టాక్ తెచ్చుకున్న తేజ్, కెరీర్ మొదట్లోనే హిట్లు అందుకుని తనకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తన మావయ్య చిరంజీవి తరహాలోనే మొదట ఒక సినిమా మొదలుపెడితే మరో సినిమా ముందు విడుదలైంది. సాయి ధరమ్ తేజ్ ముందు ఫేస్ చేసిన కెమెరా రేయ్ సినిమాకు కాగా, పిల్లా నువ్వు లేని జీవితం ముందు విడుదలైంది. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయింది. అంటే తేజ్ ఇండస్ట్రీకి వచ్చి అర్ధ శతాబ్దం పూర్తయిందన్నమాట. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన తేజ్, తర్వాత విడుదలైన రేయ్ తో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సూపర్ హిట్స్ తో కెరీర్ లో ముందుకు దూసుకెళ్లాడు.

అయితే సినిమాలు త్వరగా చేయాలి, ఏడాదికి రెండు, మూడు సినిమాలు విడుదల చేయాలన్న తొందరలో కథల ఎంపికలో తప్పులు చేస్తూ వచ్చాడు తేజ్. దీంతో ఒకటి తర్వాత ఒకటిగా ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ వంటి ప్లాప్స్ తో పూర్తిగా డీలా పడ్డాడు. ఈ ప్లాపుల వల్ల తేజ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఒక దాన్ని మించి మరొక సినిమా ప్లాపులుగా మిగిలాయి. ఆఖరి రెండు సినిమాలు ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ అయితే కనీసం ఓపెనింగ్స్ ను తెచుకోలేకపోయింది. అయితే సాయి ధరమ్ తేజ్ లో కనువిప్పు త్వరగానే కలిగింది. ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్న కంగారులో తప్పులు చేసిన తేజ్ ఆ తప్పును పక్కనపెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చిత్రలహరి అనే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు.

- Advertisement -

వరస ప్లాపుల తర్వాత వచ్చిన చిత్రం కావడంతో కలెక్షన్స్ భారీ స్థాయిలో రాలేదు కానీ డీసెంట్ హిట్ అనిపించుకుంది. చిత్రలహరితో తత్త్వం బోధపడిన తేజ్ ఆచి తూచి కథలను ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టాడు. చిత్రలహరి విడుదల తర్వాత కొన్ని రోజులు బాగా ఆలోచించి ఎంపిక చేసిన సినిమా ప్రతిరోజూ పండగే. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి మారుతి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తుండడంతో మార్కెట్ లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా టైటిల్ దగ్గరనుండి పాట, పోస్టర్, ప్రోమోస్ ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉండడంతో మార్కెట్ ఈ చిత్రంపై ధీమాగా ఉంది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఐదేళ్ల కెరీర్ లో హిట్ల కన్నా ప్లాపులు ఎక్కువ రుచి చూసినా, తేజ్ మెగా హీరోల్లో ప్రామిసింగ్ గా అనిపించడంతో ఇంకా ఫ్యాన్స్ లో నమ్మకం ఉంది. మళ్ళీ హిట్లు కొట్టి తేజ్ టాప్ హీరో స్థాయికి త్వరగా చేరుకోవాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All