Homeటాప్ స్టోరీస్హైదరాబాద్ లో ప్రభాస్ సాహో

హైదరాబాద్ లో ప్రభాస్ సాహో

saaho new schedule in hyderabadఈరోజు హైదరాబాద్ లో ప్రభాస్ సాహో కొత్త షెడ్యూల్ మొదలయ్యింది . భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇంతకుముందు దుబాయ్ లో షూటింగ్ జరుపుకోగా తాజాగా హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలయ్యింది . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుండగా విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు . రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది .

హైదరాబాద్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది దాంతో సాహో పై భారీ అంచనాలు నెలకొన్నాయి . తెలుగు , తమిళ్ , హిందీ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . భారీ యాక్షన్ సీన్స్ తో హాలీవుడ్ చిత్రాన్ని తలపించేలా నిర్మిస్తున్నారట . ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచారు , ఇక ఇపుడేమో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఆ అంచనాలను మరింతగా పెంచుతున్నారు . ఈ సినిమా పూర్తికాకుండానే రాధాకృష్ణ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు ప్రభాస్ .

- Advertisement -

English Title: saaho new schedule in hyderabad

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All