
ప్రభాస్ నటించిన భారీ చిత్రం సెన్సార్ ఇబ్బందులను ఎట్టకేలకు అధిగమించింది . భారీ యాక్షన్ సీన్స్ తో పాటుగా రక్తపాతాలు, హింస ఎక్కువగా ఉండటంతో మొదట ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి సిద్దపడ్డారుట సెన్సార్ సభ్యులు లేదంటే కొన్ని హింసాత్మక సన్నివేశాలు తొలగించాలని కూడా చెప్పారట ! అయితే ఏ సర్టిఫికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది కాబట్టి యు బై ఏ ఇవ్వమన్నారని తెలుస్తోంది . ఇక సెన్సార్ సభ్యులు కూడా యు బై ఏ కు సిద్దపడ్డారుట .
భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేయడం ఖాయమని అంటున్నారు , మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ అని తేలింది . సెన్సార్ టాక్ ప్రకారం బాగానే ఉంది సాహో . అయితే అసలైన తీర్పు మాత్రం ఇవ్వాల్సింది ప్రేక్షకులే ! వాళ్ళు ఇచ్చేదే నిజమైన తీర్పు దాంతో వాళ్ళు ఏం చెబుతారు అన్నది మాత్రం ఆగస్టు 30 న తేలనుంది .