Homeటాప్ స్టోరీస్అన్ని చోట్లా డిజాస్టర్.. ఆ రెండు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్

అన్ని చోట్లా డిజాస్టర్.. ఆ రెండు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్

Saaho Collections
Saaho Collections

ఈ ఏడాది విడుదలైన అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా సాహో గురించి చెప్పుకోవచ్చు. విడుదలకు ముందు నుండే ఎక్కువ హైప్ తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్ తో విడుదలైన చిత్రం కూడా ఇదే. అలాగే అంచనాలను అందుకోవడంలో విఫలమై భారీ డిజాస్టర్ గా మిగిలిన చిత్రం కూడా ఇదే.

సాహో బయ్యర్లకు దాదాపు 100 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. ఒక్క నార్త్ లో తప్ప మిగిలిన అన్ని చోట్లా కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు బూడిదే మిగిలింది. నార్త్ లో డిస్ట్రిబ్యూటర్లు మాత్రం లాభాల పంట పండించుకున్నారు. సాహో అక్కడ 150 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అంతేనా.. బీహార్, ఒడిశాలలో సాహో వసూళ్ల ప్రభంజనానికి అక్కడి ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయారు.

- Advertisement -

ఒడిశాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా సాహో నిలిచింది. మొదటి సినిమా కూడా ప్రభాస్ దే బాహుబలి సెకండ్ పార్ట్. బీహార్ లో కూడా బడా బాలీవుడ్ హీరోలను వెనక్కునెట్టి లిస్ట్ లో ఆరో స్థానం సంపాదించింది సాహో. ఇలా రెండు రాష్ట్రాల్లో సాహో వసూళ్ల ప్రభంజనం సాగింది. మిగతా చోట్ల డిజాస్టర్ గా మిగిలింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All