
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌లు టర్న్‌ల నేపథ్యంలో `ఆర్ ఎక్స్ 100` ప్రొడ్యూసన్ అశోక్‌రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి శ్రావణి ఇటీవల ఆత్మ హత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఆత్మ హత్యపై ఎస్ార్ నగర్ పోలీసులు విచారణ చేపట్టడం.. ఈ కేసులో దేవరాజ్‌రెడ్డి, సాయమికృష్ణారెడ్డి ప్రధాన నిందుతులని నిర్ధారణకు వచ్చిన పోలీసుల వీరిని అదుపులోకి తీసుకునని ఇటీవలే మీడియా ముందు హాజరు పరిచారు.
అయితే ఈ కేసులో శ్రావణితో `ఆర్ ఎక్స్ 100` నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ టేప్‌లు బయటికి రావడంతో ఈ కేసులో మూడవ నిందితుడిగా అశోక్‌రెడ్డిని చేర్చారు. విషయం తెలుసుకున్న అశోక్‌రెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో వున్నారు. తాజాగా తనపై వదంతులు మొదలవడంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా శ్రావణి ఆత్మ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తను శ్రావణిని వివాహం చేసుకోవానలనుకున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే శ్రావణిని పెళ్లి చేసుకుంటానని అశోక్‌రెడ్డి వేధించినట్టు పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. అతనికి వైద్య పరీక్షలతో పాటు కరోనా టెస్టుల అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలిస్తారట.