Homeటాప్ స్టోరీస్మరో హీరో తో రొమాన్స్ చేయనున్న ఆర్ ఎక్స్ 100 భామ

మరో హీరో తో రొమాన్స్ చేయనున్న ఆర్ ఎక్స్ 100 భామ

RX 100 Beauty Payal rajput to act alongside nagarjuna ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి పిచ్చెక్కించిన భామ పాయల్ రాజ్ పుత్ తాజాగా సీనియర్ హీరో నాగార్జున తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది . నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . కాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు మన్మథుడు 2 రాబోతోంది . నటుడు రాహుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారిన రాహుల్ ఇప్పుడు ఏకంగా నాగార్జున నే డైరెక్ట్ చేయబోతున్నాడు .

ఆ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేశారట ! ఇటీవలే ఆడిషన్స్ కూడా తీసుకున్నారట పాయల్ ఆ క్యారెక్టర్ కు సరిపోతుంది కాబట్టి దాదాపుగా ఎంపిక పూర్తయ్యింది అని తెలుస్తోంది . నాగార్జున తో మాత్రమే కాకుండా రవితేజ సరసన కూడా నటిస్తోంది పాయల్ అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ ఐటెం సాంగ్ చేయడానికి కూడా ఒప్పుకుంది పాయల్ రాజ్ పుత్ .

- Advertisement -

English Title: RX 100 Beauty Payal rajput to act alongside nagarjuna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All