Homeటాప్ స్టోరీస్11 కోట్ల దిశగా ఆర్ ఎక్స్ 100

11 కోట్ల దిశగా ఆర్ ఎక్స్ 100

RX 100 15 Days Collectionsకార్తికేయపాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఘనవిజయం సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . మొత్తం మీద 11 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది . కేవలం 2 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ ఆర్ ఎక్స్ 100 చిత్రం రూపొందింది . ఈ కథ ని వినమని , సినిమా చేయమని హీరో విజయ్ దేవరకొండ ని అలాగే సుధీర్ బాబు ని అడిగాడట దర్శకుడు అజయ్ భూపతి . కానీ అతడి కథ వినడానికి , సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు ఈ హీరోలు దాంతో కొత్తవాడు అయిన కార్తికేయ తో ఆర్ ఎక్స్ 100 సినిమా చేసాడు .

కట్ చేస్తే మొదటి రోజు నుండే భారీ వసూళ్ల ని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల షేర్ రాబట్టింది . 2 కోట్లతో తీసిన సినిమాకు కలెక్షన్ల పరంగానే 9 కోట్ల లాభం ఆ తర్వాత శాటిలైట్ , డబ్బింగ్ , రీమేక్ , డిజిటల్ రైట్స్ రూపంలో ఇంకా చాలా పెద్ద మొత్తమే వస్తోంది ఆర్ ఎక్స్ 100 చిత్రానికి . పాయల్ రాజ్ పుత్ గ్లామర్ , అజయ్ భూపతి డైరెక్షన్ వెరసి ఈ చిన్న చిత్రాన్ని పెద్ద చిత్రంగా చేసాయి . ఈ సినిమాని కొన్న బయ్యర్లు భారీ లాభాలు రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు .

- Advertisement -

English Title: RX 100 15 Days Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All