Homeటాప్ స్టోరీస్పది కోట్ల షేర్ సాధించిన ఆర్ ఎక్స్ 100

పది కోట్ల షేర్ సాధించిన ఆర్ ఎక్స్ 100

RX 100 11 Days world wide Collectionsపదకొండు రోజుల్లో పది కోట్ల షేర్ సాధించి ప్రభంజనం సృష్టించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . కొత్త హీరో కొత్త హీరోయిన్ ఆపై దర్శక నిర్మాతలు కూడా కొత్తవాళ్లు అయినప్పటికీ అండర్ డాగ్ గా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది . జూలై 12న విడుదలైన ఈ చిత్రానికి యువతరం బ్రహ్మరధం పడుతున్నారు , దాంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా నటించగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది . ఇక ఈ విజయంలో పాయల్ రాజ్ పుత్ దే అగ్ర తాంబూలం .

సీరియల్ లలో నటించే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో అందాలను ఆరబోసి , ఘాటు లిప్ లాక్ లు కౌగిలింతలు ఇచ్చి సంచలనం సృష్టించింది . రొమాంటిక్ సీన్స్ కుర్రాళ్ళని విపరీతంగా అలరిస్తున్నాయి దాంతో విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్ల ని సాధిస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా 10. 15 కోట్ల షేర్ వసూల్ చేసింది ఆర్ ఎక్స్ 100 చిత్రం .
ఏరియాల వారీగా ఆర్ ఎక్స్ 100 షేర్ ఇలా ఉంది

- Advertisement -

నైజాం : 4.54 కోట్లు

సీడెడ్ : 1.14 కోట్లు

వైజాగ్ : 1.03 కోట్లు

గుంటూరు : 0.59 లక్షలు

ఈస్ట్ : 0.72 లక్షలు

వెస్ట్ : 0.57 లక్షలు

కృష్ణా : 0.60 లక్షలు

నెల్లూరు : 0.23 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.38 లక్షలు

ఓవర్ సీస్ : 0.35 లక్షలు

వరల్డ్ వైడ్ కలెక్షన్లు : 10.15 కోట్లు

English Title: RX 100 11 Days world wide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All