Homeటాప్ స్టోరీస్తెలుగు సినిమాపై ర‌ష్య‌న్ ఎంబ‌సీ ట్వీట్‌!

తెలుగు సినిమాపై ర‌ష్య‌న్ ఎంబ‌సీ ట్వీట్‌!

తెలుగు సినిమాపై ర‌ష్య‌న్ ఎంబ‌సీ ట్వీట్‌!
తెలుగు సినిమాపై ర‌ష్య‌న్ ఎంబ‌సీ ట్వీట్‌!

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగులో తెర‌కెక్కిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. సినిమా విడుద‌లై ఏళ్లు గ‌డుస్తున్నా ప్ర‌తీ ఏడాది ఏదో ఒక రూపంలో చ‌రిత్ర సృష్టిస్తూనే వుంది. వ‌సూళ్ల ప‌రంగా రెండు వేల కోట్లు వ‌సూళ్ల‌ని సాధించి హిస్ట‌రీ క్రియేట్ చేసిన `బాహుబ‌లి 2` తాజాగా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ని సాధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, మిందీ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం జ‌పాన్‌, చైనా దేశాల్లోనూ వీర విహారం చేసింది. తాజాగా ఈ చిత్రాన్ని ర‌ష్య‌న్ భాష‌లోకి అనువ‌దించి రిలీజ్ చేశారు. ర‌ష్య‌న్ భాష‌లో అనువాదం అయిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ర‌ష్య‌న్ ఛాన‌ల్ టెలీకాస్ట్ చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ విష‌యాన్ని ఇండియాలో వున్న ర‌‌ష్య‌న్ ఎంబ‌సీ త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. ర‌ష్య‌న్ టీవీలో టెలీకాస్ట్ అవుతున్న ఓ వీడియోని కూడా షేర్ చేసింది.

- Advertisement -

భారతీయ సినిమా రష్యాలో ప్రజాదరణ పొందింది. రష్యన్ టీవీ ప్రస్తుతం ఏమి ప్రసారం చేస్తుందో చూడండి: రష్యన్ వాయిస్ ఓవర్‌తో బాహుబలి!` అని ట్వీట్ చేసింది. ర‌ష్య‌న్ టీవీలో టెలీకాస్ట్ అయిన తొలి భార‌తీయ సినిమాగా `బాహుబ‌లి 2 ` అరుదైన ఘ‌న‌ట‌ని సాధించ‌డం విశేషంగా చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All