Homeటాప్ స్టోరీస్అనురాగ్‌ని మ‌రో న‌టి ఇరికించిందిగా!

అనురాగ్‌ని మ‌రో న‌టి ఇరికించిందిగా!

అనురాగ్‌ని మ‌రో న‌టి ఇరికించిందిగా!
అనురాగ్‌ని మ‌రో న‌టి ఇరికించిందిగా!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌ను అవ‌కాశాల కోసం తిరుగుతున్న స‌మ‌యంలో సినిమా ఆఫ‌ర్ ఇస్టాన‌ని, త‌న‌ని గ‌దిలోకి ర‌మ్మ‌ని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, త‌న‌కు అమితాబ్ తెలుస‌ని, అభిషేక్‌తో సినిమా చేయ‌మ‌ని బ‌ల‌వంతం చేస్తున్నాడ‌ని, ఆ మూవీలో నీకు అవ‌కాశం ఇస్తాన‌ని న‌మ్మించిన అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని న‌టి పాయ‌ల్ ఘోష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ వివాదంపై అనుకూలంగా, వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ న‌డుస్తున్నాయి. మ‌హిళా సంఘాల‌తో పాటు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ కూడా అనురాగ్ పై ఘాటుగా స్పందించింది. అనురాగ్‌ని అరెస్ట్ చేయండ‌ని సంచ‌ల‌న ట్వీట్ చేసింది.  ఇదిలా వుంటే పాయ‌ల్ ఘోష్ త‌ర‌హాలో మ‌రో న‌టి అనురాగ్ క‌శ్య‌ప్‌పై సంచల‌న ఆరోప‌ణ‌లు చేస్తోంది. త‌న‌ని మాట‌ల‌తో లైంగికంగా వేధించాడ‌ని బెంగాలీ న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

- Advertisement -

బెంగాలీ న‌టి రూపా ద‌త్తా ఫేస్ బుక్ చాట్‌లో త‌న‌ని అనురాగ్ క‌శ్య‌ప్ వేధించాడ‌ని, లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడ‌ని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఫేస్ బుక్ చాట్‌ని మీడియాకు చూపించింది. అయితే ఫేస్ బుక్‌లో ఆమెతో చాట్ చేసింది అనురాగ్ క‌శ్య‌ప్ కాద‌ని అనురాగ్ స‌ఫ‌ర్ అని తేల‌డంతో త‌న తొంద‌ర‌పాటుని గ‌మ‌నించిన రూపా ద‌త్తా ప్లేటు మార్చి అనురాగ్‌కు డ్ర‌గ్స్‌తో లింకులున్నాయ‌ని కొత్త ప‌ల్ల‌వి వినిపించ‌డంతో మీడియా విస్తూ పోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All