Homeగాసిప్స్మళ్ళీ మెగా అభిమానులను ఊరించే పుకారు!

మళ్ళీ మెగా అభిమానులను ఊరించే పుకారు!

మళ్ళీ మెగా అభిమానులను ఊరించే పుకారు!
మళ్ళీ మెగా అభిమానులను ఊరించే పుకారు!

ఏదైనా సినిమా ప్రకటించిన దగ్గరనుండి బోలెడన్ని పుకార్లు పుడుతుంటాయి. హీరో పాత్ర దగ్గరనుండి, అందులో హీరోయిన్ ఎవరు, నటీనటులు ఎవరు, కథ ఎలా ఉంటుంది, ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏంటి అంటూ సవాలక్ష రూమర్స్ షికార్లు చేస్తుంటాయి. వీటిలో అన్నీ నిజమవ్వాలని లేదు. నిజానికి కొన్ని రూమర్స్ కు సినిమా వాళ్ళు సైతం నవ్వేసి వెళ్లిపోతుంటారు. కొన్నిటిని ఖండించి సమాధానమిస్తుంటారు. అవే రూమర్స్ నిజమైతే మాత్రం యూనిట్ సభ్యులు కూడా కామ్ గా ఉండిపోతారు. ఇప్పుడు ఇదే విషయం మెగా 152 విషయంలో జరుగుతోందా అనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెల్సిందే. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఇందులో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడని ఒక రూమర్ బయల్దేరింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరంజీవి యంగర్ వెర్షన్ గా చరణ్ కనిపించనున్నాడన్నది ఆ రూమర్ సారాంశం. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ రూమర్ నెమ్మదిగా తెరమరుగైంది. అందరూ దాన్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి వరకూ తొలి షెడ్యూల్ ఉండనుంది. ఇందులో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు, మరికొన్ని ఆరంభ సన్నివేశాలను, ఒక పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. సంక్రాంతికి కొన్ని రోజులు విరామం తీసుకుని మళ్ళీ సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్ర వేడుకలో ఈ సినిమాను 99 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించాడు. అదే నిజమైతే చిరు 152 సమ్మర్ కు కానీ దసరాకు కానీ వచ్చే వీలుంది.

- Advertisement -

ఇక ఈ వార్తలతో పాటు మరోసారి రామ్ చరణ్ గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అప్పట్లో వచ్చిన రూమర్సే. రామ్ చరణ్ మెగాస్టార్ సినిమాలో కొద్ది సేపు నటించనున్నాడని. ఇద్దరూ కలిసి నటించకపోయినా ఒక సినిమాలో కనిపిస్తారు అంటే మెగా అభిమానులకు ఆనందమే కదా. అందుకే ఇన్ని సార్లు ప్రచారంలోకి వస్తోందంటే నిజంగానే ఈ రూమర్ నిజమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. మెగా అభిమానులు ఇప్పుడు ఈ వార్త నిజమేనేమోననే ఆనందంలో ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All