Homeటాప్ స్టోరీస్ఎఫ్3 విషయంలో అవన్నీ ఒట్టి రూమర్లే

ఎఫ్3 విషయంలో అవన్నీ ఒట్టి రూమర్లే

ఎఫ్3 విషయంలో అవన్నీ ఒట్టి రూమర్లే
ఎఫ్3 విషయంలో అవన్నీ ఒట్టి రూమర్లే

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఎఫ్ 3 పేరిట రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి.

డిసెంబర్ 14 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 సినిమాపై బోలెడన్ని రూమర్స్ షికార్లు చేయడం మొదలైంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేసాడని, ఆ అమౌంట్ తో షాక్ తిన్న దిల్ రాజు ఇప్పుడు వరుణ్ తేజ్ స్థానంలో వేరొకరిని తీసుకోమని అనిల్ రావిపూడికి చెప్పినట్లు రూమర్స్ సారాంశం.

- Advertisement -

అయితే ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించడానికి చాలా సంతోషంగా ఉన్నాడు. పారితోషికం కూడా రూమర్స్ లో తెలిపినంత పెద్ద అమౌంట్ కాదట. సో, ఎఫ్ 3 విషయంలో ఇవన్నీ రూమర్స్ అని నమ్మేయొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All