Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో వ‌చ్చేసింది!

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో వ‌చ్చేసింది!

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో వ‌చ్చేసింది!
ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో వ‌చ్చేసింది!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. ఫ్రీడ‌మ్‌ఫైట్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతానికి మించి చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్టర్‌, టైటిల్ లోగో ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని గ‌త కొన్ని నెల‌లుగా అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూసుల‌కు తెర తీస్తూ ఉగాది రోజున చిత్ర బృందం సినీ ప్రియుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఒకే సారి డ‌బుల్ ధ‌మాకాని అందించింది.

టైటిల్ లోగో, మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి `ఆర్ ఆర్ ఆర్‌` (రౌద్రం ర‌ణం రుధిరం) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్ బ‌డ‌బాగ్నిగా చూపించిన రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని ఉప్పెన‌గా చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ఒక‌రు రౌద్రం ,.. ఒక‌రు రుధిరం…. ఈ ఇద్ద‌రు క‌లిసి చేసే ర‌ణం ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోండి అన్న‌ట్టుగా వుంది మోష‌న్ పోస్ట‌ర్‌. 1920 నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం బ్రిటీష్ ఇండియా కాలం నేప‌థ్యంలో అత్యంత శ‌క్త‌మంతంగా రాజ‌మౌళి మార్కు అబ్బుర ప‌రిచే స‌న్నివేశాల‌తో సాగుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

- Advertisement -

మోష‌న్ పోస్ట‌ర్‌లో కీర‌వాణి ఇచ్చిన నేప‌థ్య సంగీతం, బీజిఎమ్స్ రోమాంచితంగా వున్నాయి. సినిమాలో ఆయ‌న త‌న నేప‌థ్య సంగీతంతో మ‌రోసారి `బాహుబ‌లి` మ్యాజిక్‌ని రీ క్రియేట్ చేయ‌బోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. అలాయాభ‌లట్‌, ఒలివియా మోరీస్ క‌థానాయిక‌లు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 8న ప్ర‌పంచ వ్యాప్తంగా 10 ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All