
ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క శాంపిల్ చాలు..బుక్ మై షో లో టికెట్స్ ఆలా ఓపెన్ అయ్యాయో లేదో వారం రోజుల పాటు టికెట్స్ అన్ని ఫుల్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ అతృతతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు బుక్ మై షో లో టికెట్స్ ఓపెన్ అవుతాయా..అని ఎదురుచూసారు. కానీ ఆలా ఓపెన్ కాగానే హాట్ కేకుల్లా సేల్ అవ్వడం తో అరే అప్పుడే అయ్యిపోయాయా అని బాధపడుతున్నారు.
ఇక హైదరాబాద్ లో అయితే వారం పాటు ఎక్కడ ఖాళీ లేవు.. ఏ థియేటర్ చూసిన సోల్డ్ అవుట్ అనే కనిపిస్తుండడం తో వేరే చోట ట్రై చేస్తున్నారు అభిమానులు. మరో పక్క ఆర్ఆర్ఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలను భారీగానే పెంచారు. ఏపీలో అత్యధికంగా రూ.325 టికెట్ ధర.. అలాగే తెలంగాణలో అత్యధిక టికెట్ ధర 400గా నిర్ణయించారు. తొలి మూడు రోజులు ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. టికెట్ ధరలు ఎక్కువగానే పెరిగాయి.