
అంత అనుకున్నట్లే ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ..పెద్ద ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో ఫస్ట్ డే కలెక్షన్లు దుమ్ములేపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలు భారీగా పెంచడం తో కలెక్షన్లు కుమ్మేసాయి.
ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు చూస్తే..
నైజాంలో ఫస్ట్ డే రూ. 23.25 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పగా..పశ్చిమ గోదావరి జిల్లాలో 5.93 కోట్లు, గుంటూరులో 7 కోట్లు, నెల్లూరులో 3 కోట్ల వసూళ్లను రాబట్టింది. రాయలసీమ లో 1.23 కోట్లు సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్లకుపైగానే షేర్, 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది.