
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోన్న చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. ఇండస్ట్రీ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తోన్న విషయం ఒకటైతే బాహుబలి తర్వాత ఇండియాలోనే క్రేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి నుండి వస్తోన్న చిత్రమిది. పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీగా ఈ సినిమాను రూపొందించాడు జక్కన్న. ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన నాటు నాటు సాంగ్ సెన్సేషన్ అయింది.
ఆర్ ఆర్ ఆర్ ను జనవరి 7న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ కు మెయిన్ మార్కెట్ తెలుగే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వ్యవహారం కారణంగా ఇండస్ట్రీ కొంత నలిగిపోతోన్న విషయం తెల్సిందే. ఇదే టికెట్ రేట్లతో ఆంధ్రప్రదేశ్ లో ఆర్ ఆర్ ఆర్ కు చుక్కెదురవ్వక తప్పదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆర్ ఆర్ ఆర్ కోర్టు మెట్లెక్కనుందని ప్రచారం జరిగింది. టికెట్ రేట్లను ఇదివరకటిలా ఉంచాలని కోరుతూ కేసు ఫైల్ చేయనుందని అన్నారు.
కానీ దీనిపై ఆర్ ఆర్ ఆర్ టీమ్ అప్డేట్ ఇచ్చింది. కోర్టుకు వెళ్తామన్న మాటల్లో నిజం లేదు. మాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసుకుంటామని ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
Also Read:
RRR నుండి నాటు నాటు సాంగ్ ప్రోమో.. సీటీలు చిరిగిపోవాల్సిందే..!
RRR అదిరిపోయిన ఫస్ట్ గ్లింప్స్..!
RRR రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 7న గ్రాండ్ రిలీజ్..!
RRR సెట్‌లో పవన్‌కల్యాణ్ ఏం జరుగుతోంది?