
ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..మార్చి 25 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రెండు వారాలు పూర్తి అయ్యేలోపే వరల్డ్ వైడ్ గా 900 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక నార్త్ లోను వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 200 కోట్లు క్రాస్ చేసి పలు బాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఈ తరుణంలో హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమాని రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ జయంతిలాల్ గడ బుధవారం సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేసారని తెలుస్తోంది.
చిత్ర యూనిట్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ పార్టీకి హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ లో రాజమౌళితో పాటుగా చరణ్ మరియు తారక్ లను సత్కరించేందుకు పెన్ స్టూడియోస్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. దీని కోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం ముంబైకి బయలుదేరి వెళ్తారని సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ #RC15 షూటింగ్ కోసం అమృత్ సర్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ముంబైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.