Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ కథ ఏంటో తెలుసా

ఆర్ ఆర్ ఆర్ కథ ఏంటో తెలుసా

RRR story revealedఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” . అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర  బడ్జెట్ ఎంతో తెలుసా …….. 400 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోందని అసలు విషయాన్ని  తెలిపాడు నిర్మాత డివివి దానయ్య . ఈ భారీ చిత్రాన్ని నిర్మించే అదృష్టం నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని అంటున్నాడు దానయ్య .

 

- Advertisement -

తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ , రాంచరణ్ , అలియా భట్ , అజయ్ దేవ్ గన్ , సముద్ర ఖని , డైసీ ఎడ్గార్ జోన్స్ తదితరులు నటిస్తున్నారు . ఇక కథ విషయానికి వస్తే ……. 1920 – 1922 నాటి కాలం కథ . అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయగా అదే సమయంలో తెలంగాణ లో కొమరం భీం నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు . అయితే ఈ ఇద్దరూ ఎప్పుడు కూడా కలుసుకోలేదు , అయితే ఈ ఇద్దరు పోరాట యోధులు కలిస్తే …… పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహాజనితమైన కథాంశంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతోందని అసలు కథని రివీల్ చేసాడు జక్కన్న . హీరోలను వీరోచితంగా చూపించడంలో జక్కన్న ది అందెవేసిన చెయ్యి దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

English Title : RRR story revealed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All