Homeగాసిప్స్R.R.R సినిమా స్టోరీ ఇదేనా...?

R.R.R సినిమా స్టోరీ ఇదేనా…?

R.R.R సినిమా స్టోరీ ఇదేనా...?
R.R.R సినిమా స్టోరీ ఇదేనా…?

దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత డివివి దానయ్య గారు సమర్పణ లో వస్తున్న సినిమా “R.R.R.” ఈ సినిమాకు సంబంధించి దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా  ప్రారంభ సమయంలోనే దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమాకు సంబంధించిన కథను రివీల్ చేశారు. ఈ సినిమా కథ 1920వ సంవత్సరంలో భారత దేశ నేపథ్యంలో జరుగుతుందని అల్లూరి సీతారామరాజు పాత్రధారిగా రామ్ చరణ్ తేజ్; మరియు కొమురం భీం పాత్రధారిగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో చరిత్రతో పాటు కొంత కాల్పనికత కూడా ఉంటుందని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముందే తెలియజేశారు.

సినిమా కధ విషయానికి వచ్చినట్లయితే అల్లూరి సీతారామరాజు మొదట ఒక ఆయుర్వేద వైద్యునిగా ఆ తరువాత ఒక మహర్షిగా ప్రజలకు సేవలు అందించి తరువాత ఆ కాలంలో మన్యం ప్రాంతంలో ఉన్న అనేక ఆదివాసీ జాతుల కు నాయకత్వం వహించి స్వాతంత్రోద్యమం వైపు నడిపించిన మహోన్నతమైన వ్యక్తి. కొమరంభీం విషయానికి వస్తే ప్రత్యేక గోండు రాజ్యం స్థాపన లక్ష్యంగా “జల్ జమీన్ జంగల్” నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించిన యోధుడు కొమరం భీమ్.

- Advertisement -

చరిత్రలో భాగంగా ఒకానొక సమయంలో కొమరం భీమ్ కొంతకాలంపాటు అస్సాం ప్రాంతానికి తేయాకు ఉద్యానవనాల్లో పని చేయడానికి వెళ్తాడు. అక్కడ కొమరం భీమ్ కి అల్లూరి సీతారామ రాజు ముఖ్య అనుచరుడైన మల్లు దొరతో పరిచయం ఏర్పడుతుంది. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు తన పోరాటం గురించి తెలుసుకొని పూర్తి పొందిన కొమురంభీం తర్వాతి కాలంలో తాను కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తాడు. చరిత్రలో మాత్రం వీరిరువురు కలిసినట్లు, ఒకరికి ఒకరికి పరిచయం ఉన్నట్లు, ఇద్దరు స్నేహితులు అనడానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ కొంచెం కాల్పనికతను కూడా జోడించారు. ఇక టైటిల్ మరియు మోషన్ పోస్టర్ లో దానికి సంబంధించిన సందర్భం చెప్పడానికి ప్రయత్నం చేశారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

ఇక సినిమాలో వీరిద్దరూ ఏ సందర్భంలో కలిశారు.? కలిసినప్పుడు ఏమి మాట్లాడుకున్నారు.? అప్పట్లో ఉన్న సమస్యల మీద వీరి కార్యాచరణ ఎలా కొనసాగింది.? తర్వాత ఎవరికి వారు తమ ఉద్యమాలలో ఎలాంటి ఫలితాలు సాధించారు.? అనే విషయాలు సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నాయి.

ఒక అసాధ్యాన్ని సుసాధ్యం మార్చగలిగే శక్తి  సినిమాకు ఉంది. మనం నిత్య జీవితంలో ఊహించి ఆనందపడే ఎన్నో విషయాలను భారీ వెండితెరమీద అన్ని రకాల హంగులతో చూసుకొని ఆనందించడంలో ఒకరకమైన భావోద్వేగం ఉంటుంది.  ఇక టైటిల్ మరియు మోషన్ పోస్టర్ లో రాజమౌళి ఇదే విషయాన్ని మనకు తెలియజేశారు. సాధారణంగా “నీరు” “నిప్పు” అనేవి రెండు వ్యతిరేక శక్తులు. నీరు నిప్పుని ఆర్పగలదు.అదేవిధంగా నిప్పు నీటిని ఆవిరి చేయగలదు. కానీ ఆ నిప్పు, నీరు రెండు కలిసినప్పుడు సంభవించే ఒక అద్భుతమైన శక్తి తో అసాధ్యాలు అనుకున్న పనులను సైతం సాధించవచ్చు..! అనే విషయాన్ని రాజమౌళి తెలియజేశారు. మోషన్ పోస్టర్ చివరిలో ఇద్దరూ కలుసుకున్న తర్వాత మళ్లీ తమ తమ దారిలో ప్రయాణం కొనసాగించారు..! అన్న విషయాన్ని తెలియజేయడానికి ఇద్దరినీ ఎవరి దారిలో వారు పయనిస్తున్నట్లు చూపించి ముగించారు. భారతదేశానికి సంబంధించి స్వాతంత్రోద్యమ పోరాటం అనేది ఒక వీరోచితమైన మరియు రోమాంచితంమైన ఘట్టం. అలాంటి విషయాలను ఎస్.ఎస్.రాజమౌళి లాంటి దార్శనికుడు వెండితెరపై ఆవిష్కరిస్తే ఆ పూర్తి రాబోయే కొన్ని తరాల వరకు ఆ స్ఫూర్తి మనలో నిలిచిపోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All