Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ ప్రోమో విడుదలయ్యేది ఆ రోజే!

ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ ప్రోమో విడుదలయ్యేది ఆ రోజే!

ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ ప్రోమో విడుదలయ్యేది ఆ రోజే!
ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ ప్రోమో విడుదలయ్యేది ఆ రోజే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. ఆగస్ట్ 22న ఈ షో కర్టైన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది. మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా రామ్ చరణ్ వస్తున్నాడు. వీరిద్దరూ పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రోమో రీసెంట్ గా విడుదలైంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య స్పెషల్ బాండ్ ఈ ఎపిసోడ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశముంది. ఈ ఎపిసోడ్ లోనే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ను కూడా చేపట్టనున్నారు. ఆగస్ట్ 22న ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ ప్రోమోను విడుదల చేస్తారని సమాచారం.

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All