Homeటాప్ స్టోరీస్`ఆర్ఆర్ఆర్` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!

`ఆర్ఆర్ఆర్` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!

`ఆర్ఆర్ఆర్` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!
`ఆర్ఆర్ఆర్` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో 350 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. `బాహుబ‌లి` త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా దేశ వ్యాప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఈ రోజు మ‌ధ్యాహ్నం బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తున్నామంటూ ప్ర‌క‌టించిన మేక‌ర్స్ అన్న‌ట్టుగానే బిగ్ అనౌన్స్‌మెంట్‌ని ఇచ్చారు. దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్డోబ‌ర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనికితోడు రిలీజ్ డేట్ పోస్ట‌ర్ని కూడా విడుద‌ల చేసి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

- Advertisement -

ఈ స్టిల్‌లో గుర్రంపై క‌ద‌న‌రంగానికి రామ్‌చ‌ర‌ణ్ క‌దులుతుంటే.. అదే క‌ద‌నోత్సాహాంతో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మోటార్ బైక్‌పై వెళుతున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. ఈ స్టిల్‌కి తోడు హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ షేర్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆనందోత్సా‌హాల్ని రెట్టింపు చేస్తోంది. నీరు, నిప్పు క‌లిసి ఎవ‌రూ ఆప‌లేని ఫోర్స్‌గా మారి వ‌స్తున్నాయి. అక్టోబర్ 13, 2021 న భారతీయ సినిమాను దాని అత్యుత్తమ అవతారంలో అనుభవించడానికి సిద్ధంగా ఉండండి` అంటూ చేసిన పోస్ట్ అభిమానుల‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All