Homeటాప్ స్టోరీస్మహేష్, పవన్, బన్నీ ఆశలపై నీళ్లు జల్లిన ఆర్ ఆర్ ఆర్

మహేష్, పవన్, బన్నీ ఆశలపై నీళ్లు జల్లిన ఆర్ ఆర్ ఆర్

RRR release date troubles mahesh pawan and bunny
RRR release date troubles mahesh pawan and bunny

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఉండే డిమాండే వేరు. మాములు సీజన్ తో విడుదలయ్యే సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వచ్చే సినిమాలు దాదాపు 25 నుండి 30 శాతం ఎక్కువ బిజినెస్ చేస్తాయన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు. దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సినిమాల విషయంలో జరిగేది ఇదే.  ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలకు అడ్వాంటేజ్ అని మరోసారి నిరూపితమైంది.

ఈ సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్ లో విడుదలైన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు చిత్రాలు కలిపి ప్రేక్షకుల దగ్గరనుండి 250 కోట్లపైనే వసూలు చేసాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ఈ రెండు చిత్రాలు బన్నీ, మహేష్ కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

- Advertisement -

సాధారణంగా సంక్రాంతికి మూడు, నాలుగు నెలల ముందు సంక్రాంతికి సినిమాలు షెడ్యూల్ అవుతుంటాయి. అయితే ఈ సంక్రాంతికి భారీ విజయాల నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుండే హంగామా మొదలైంది. టాప్ హీరోలు కొంత మంది తమ సినిమాలను సంక్రాంతి రేసులో నిలిపితే ఎలా ఉంటుంది అన్న చర్చలు చేసుకున్నారు. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో వచ్చిన మహేష్, వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి చిత్రంతో మరోసారి సంక్రాంతికి హంగామా చేద్దామని భావించాడు.

అలాగే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ తో తాను చేసే చిత్రాన్ని సంక్రాంతికి విడుదలయ్యేలా చూడమని చెప్పాడు. ఇక అల వైకుంఠపురములో ద్వారా భారీ హిట్ ను అందుకున్న బన్నీ కూడా సుకుమార్ తో చేసే సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని ఆదేశించాడు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ జనవరి 8న విడుదల కానున్న నేపథ్యంలో మరో భారీ సినిమాకు స్కోప్ లేనట్లే. విడుదలైతే ఒక వారం తర్వాత మీడియం బడ్జెట్ సినిమా విడుదలవ్వొచ్చు కానీ పెద్ద సినిమాకు స్పేస్ లేదు. ఇప్పుడు ఈ మూడు సినిమాలు మరో అనువైన తేదీని నిర్ణయించుకునే పనిలో పడ్డాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All