Homeటాప్ స్టోరీస్నైజాంలో గత రికార్డ్స్ బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

నైజాంలో గత రికార్డ్స్ బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

RRR movie review
RRR movie review

యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి నుండే షోస్ మొదలవ్వడం తో సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ నడుస్తుంది. అభిమానులు , సినీ ప్రముఖులు , సామాన్య ప్రేక్షకులు ఇలా అంత కూడా సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు. నిన్నంతా సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ టాక్ చర్చ నడిస్తే..ఈరోజు ఫస్ట్ డే కలెక్షన్ల గురించి ఆరా తీస్తున్నారు. ముందునుండి అంత అనుకున్నట్లే గత రికార్డ్స్ ను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసింది.

ముందుగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. గతంలో నమోదైన బాహుబలి 2 సినిమా కలెక్షన్లను సింపుల్ గా చెరిపివేసింది. బాహుబలి 2 చిత్రం తొలి రోజున 36 లక్షలు వసూలు చేస్తే.. ఇటీవల భీమ్లా నాయక్ 38 లక్షలు, పుష్ప చిత్రం 41 లక్షలు రాబట్టాయి. అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం గత సినిమాల కంటే రెండు రెట్లు అధికంగా అంటే.. 77 లక్షల రూపాయలను తొలి రోజే వసూలు చేయడం విశేషంగా మారింది.

- Advertisement -

ఓవరాల్ నైజాం కలెక్షన్స్ చూస్తే…తొలిరోజున 23.25 కోట్లు వసూలుచేసింది. ఇప్పటి వరకు నైజాంలో భీమ్లా నాయక్ 11.85 కోట్లు, పుష్ప చిత్రం 11.44 కోట్లు, రాధేశ్యామ్ 10.80 కోట్లు, సాహో 9.41 కోట్లు, బాహుబలి 8.9 కోట్లు, వకీల్ సాబ్ చిత్రం 8.75 కోట్లు రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All