
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా కుమ్మేస్తున్నాయి. దీంతో థియేటర్ లలో క్యాంటిన్ నిర్వాహకుల దగ్గరి నుండి ప్రతి ఒక్కరు ఆర్ఆర్ఆర్ వల్ల లాభాలు పొందుతున్నారు.
ఇక నైజాం ఏరియా విషయానికి వస్తే..అన్ని ఏరియాల్లో కంటే ఇక్కడ భారీగా కలెక్షన్లు రాబడుతుండడం తో దిల్ రాజు కు భారీ లాభాలు వస్తున్నట్లు తెలుస్తుంది. నైజాం ఏరియా రైట్స్ ను దిల్ రాజు రూ. 70 కోట్లకు దక్కించుకోగా..9 రోజుల్లోనే ఈ మూవీ రూ. 91.10 కోట్లు వసూలు రాబట్టింది. అంటే ఆయన పెట్టుబడి పోగా , 21 కోట్లు ఇప్పటికే వచ్చేసాయి. ఇంకా థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తో పూర్తి రన్ టైం ముగిసేసమయానికి దిల్ రాజు కు భారీగా లాభం రావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో రూ 820 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.