Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ టాక్ ...చరిత్ర రికార్డు అనేది కూడా చిన్నదైపోద్ది

ఆర్ఆర్ఆర్ టాక్ …చరిత్ర రికార్డు అనేది కూడా చిన్నదైపోద్ది

RRR MOvie talk
RRR MOvie talk

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. మెగా , నందమూరి అభిమానుల కల నెరవేరింది. తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి రుజువైంది. హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా..ఇది తెలుగు సినిమానా..తెరకెక్కించింది తెలుగు డైరెక్టరా..వీరు టాలీవుడ్ హీరోలా అనుకునేలా సినిమా తెరకెక్కింది. అర్ధరాత్రి నుండి ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ మేనియానే..ఓవర్సీస్ నుండి మొదలుపెడితే..ఇండియాలోని చిన్న గల్లీ వరకు ఎటు చూసిన ఆర్ఆర్ఆర్ గురించే చర్చ..సినిమా ఎలా ఉంటుందో..? ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో..? ఎవరు ఎలా నటించారో..? రాజమౌళి ఏమాయ చేసాడో..? అని అంత మాట్లాడుకుంటూ వచ్చారు.

కానీ సినిమా చూసిన తర్వాత మాటలు లేవు…ఆనందం తో కన్నీరు పెట్టుకుంటున్నారు. అసలు మనం చూసింది సినిమానా…అని ఆశ్చర్య పోతున్నారు. సినిమాను ఇలా కూడా తీయొచ్చా అని మాట్లాడుకుంటున్నారు. అంతలా సినిమాను తెరకెక్కించారు. సినీ ప్రముఖుల నుండి అభిమానులు, సినీ లవర్స్ ఇలా ప్రతి ఒక్కరు..ఎవరి నోటా చూసిన బ్లాక్ బస్టర్ అనే పదం చిన్నదై పోద్ది..రికార్డ్స్ అనేవి రాసుకోవడానికి పేజీలు సరిపోవు..ఎన్టీఆర్ , చరణ్ ల నటన గురించి ఎంత చెప్పిన తక్కువైద్ది అని చెప్తున్నారు. దీనిని బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పని లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All