
ఎస్ ఎస్ రాజమౌళి సక్సెస్ఫుల్ దర్శకుడు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అని కూడా చెప్పవచ్చు. తన సినిమా ఎంత భారీది అయినా కూడా ఎమోషన్స్ విషయంలో జక్కన్న ఎక్కడా రాజీపడడు. భారీ యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ పోరాట సన్నివేశాలు ఉన్న బాహుబలిలో కూడా ఎమోషన్స్ కీ రోల్ ను ప్లే చేసాయి.
అలాగే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఎమోషన్స్ ప్రధానమని రాజమౌళి చెప్పుకొస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో ఉన్న గూస్ బంప్స్ మూమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్.. ఇవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అయితే ఈ పూసలను అన్ని పట్టి ఉంచి, మణిపూసలా పట్టి ఉంచే దారమే జనని సాంగ్ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఈరోజు జనని సాంగ్ విడుదలైంది. జక్కన్న చెప్పినట్లుగానే ఈ సాంగ్ హై ఎమోషనల్ డ్రామాగా ఉంది. ఈ సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, శ్రియల స్వతంత్ర పోరాటాన్ని, వాళ్ళ స్ట్రగుల్ ను ఎక్కువగా చూపించారు. కీరవాణి ఈ పాటకు కర్మ, కర్త, క్రియగా మారాడు. తనే రాసి, పాడి, సంగీతం అందించాడు.
