Homeన్యూస్ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్

ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్

ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్
ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ కాన్వాస్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను జనవరి 7న భారీ లెవెల్లో విడుదల చేయనున్నారు. మొత్తం ఐదు భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. తెలుగు తర్వాత హిందీ మార్కెట్ ఈ చిత్రానికి చాలా ముఖ్యం. కానీ జనవరి 6న సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన గంగూభాయ్ కతీయవాడి చిత్రం విడుదలకు షెడ్యూల్ అవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ కు ఇబ్బందులు తప్పవు అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి లైన్ క్లియర్ అయింది.

గంగూభాయ్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంపై బాలీవుడ్ లో ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భన్సాలీ టాప్ డైరెక్టర్ అవ్వడం, ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై బజ్ బాగా క్రియేట్ అయింది. పెన్ స్టూడియోస్ ఈ భారీ సినిమాను నిర్మించింది.

- Advertisement -

ఇప్పుడు గంగూభాయ్ వాయిదా పడడంతో రాజమౌళి చిత్ర యూనిట్ కు కృతఙ్ఞతలు తెలియజేసాడు. థాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఇక 7న విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా ఎదురులేనట్లే.

ఇవి కూడా చదవండి:

ఆర్ ఆర్ ఆర్: కోర్టు మెట్లెక్కుతామన్న వార్తల్లో నిజం లేదు

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సాంగ్ అప్డేట్

ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్.. ఆ కాలానికి సెట్ అవ్వుద్దా?

ఆర్ ఆర్ ఆర్: విజువల్ వండర్ ను అందిస్తున్నారా!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All