
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి రోజు మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలో అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా హిందీ లో గంగూబాయి కతియావాడి, ధీ కాశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లను బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్.
హిందీ లో మార్చి 30న రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ పీరియాడికల్ డ్రామా కేవలం ఐదు రోజుల్లోనే మూడు అంకెల వసూళ్ల మార్క్‌ను దాటి తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ సినిమా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్, అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమాల కలెక్షన్స్ ను కూడా అధిగమించి 2022లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన సినిమాగా నిలిచింది.