Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీక్ కలెక్షన్ : రూ. 710 కోట్లు

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీక్ కలెక్షన్ : రూ. 710 కోట్లు

rrr first week collections
rrr first week collections

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్ బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్లు రాబడుతోంది. గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 710 కోట్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన చేసారు చిత్ర యూనిట్. ఇప్పటికే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. నార్త్‌లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా రూ. 100 కోట్లను క్రాస్‌ చేయగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.300కోట్ల మార్క్‌కు చేరువవుతోంది.

ఓవర్సీస్‌లోనూ ఇప్పటివరకు రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో సందడి చేయగా, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్‌, శ్రియా, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts