Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది

ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది

RRR First Talk
RRR First Talk

యావ‌త్ సినీ లోకమే కాదు… ప్ర‌పంచంలోని తెలుగు వారంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉండడానికి కార‌ణ‌మేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరోస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ ఈ సినిమాలో నటించడం.. వీరితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌.. అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో నటించడం ..హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ స‌హా స‌ముద్ర ఖ‌ని, శ్రియా శ‌ర‌న్ త‌దిత‌రులు నటించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. కేవలం ఇదే కాదు బాహుబ‌లితో పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డం సినిమా ఫై మరింత అంచనాలు పెరిగేలా చేసాయి. మరి కాసేపట్లో ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఈ తరుణంలో మూవీ ఫస్ట్ రివ్యూ ను తెలిపారు ఉమైర్ సందు.

UK, UAE సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌ ఉమైర్ సంధు ట్విట్టర్ ద్వారా సినిమా ఎలా ఉందనేది ట్వీట్ చేసారు. రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు. ఇక ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అజయ్ దేవగన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆలియాభట్ అందంగా ఉందన్నాడు. అంతే కాదు ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ చలనచిత్ర నిర్మాత భారీ సినిమాలను తెరకెక్కించవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు.. ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని అంటారు అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All