
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ , చరణ్ ల నటన ను , రాజమౌళి డైరెక్షన్ ను పొగడ్తలతో నింపేస్తున్నారు. ఇక విడుదలకు ముందే అనేక రికార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్..విడుదల తర్వాత కూడా అలాంటి రికార్డ్స్ నెలకొల్పుతుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హైదరాబాద్ సిటీలో RRR (రౌద్రం రణం రుధిరం) సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు చెపుతున్నారు. కేవలం అడ్వాన్స్ ద్వారా రూ. 9.86 కోట్లు వసూలు చేసిందట ఈ సినిమా. టాలీవుడ్ హిస్టరీలో ఏ సినిమా కూడా ఈ మార్కును చేరుకోలేదని అంటున్నారు. అలాగే బెంగళూరులో రూ. 5.97 కోట్లు, చెన్నైలో రూ. 2.04 కోట్లు, అహ్మదాబాద్‌లో రూ. 32 లక్షలు, ముంబైలో రూ. 1.34 కోట్లు, జైపూర్‌లో రూ. 27 లక్షలు, ఢిల్లీలో రూ. 1.24 కోట్లు, పూణెలో రూ. 43 లక్షలు, కొచ్చిలో రూ. 29 లక్షలు, సూరత్‌లో రూ. 33 లక్షలు, లక్నోలో రూ. 17 లక్షలు, భువనేశ్వర్‌లో రూ. 30 లక్షలతో కలుపుకుని మొత్తంగా రూ. 22.56 కోట్లు వసూలు చేసినట్లు చెపుతున్నారు.
భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.