
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు. అన్ని చోట్ల సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం తో ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. ఫస్ట్ డే ఈజీ గా దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు రాబట్టడం ఖాయం అంటున్నారు. ఏపీలో మొన్నటి వరకు టికెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ రీసెంట్ గా టికెట్ ధరలు పెంచడం తో పాటు ఆర్ఆర్ఆర్ కు మరో రూ.75 రూపాయిలు పెంచడం తో రాష్ట్రంలో సి-సెంటర్ థియేటర్లలో బాల్కనీ టికెట్ కనీసం 170 రూపాయలు.. గరిష్టంగా 206 రూపాయలు ఉన్నాయి. అదే బి-సెంటర్ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర కనిష్టంగా 183 రూపాయలు, గరిష్టంగా 236 రూపాయలుంది. ఇక ఏ-సెంటర్లలో కనీస ధర 206 రూపాయలు, గరిష్ఠ ధర (రీక్లెయినర్) 265 రూపాయలు గా ఉన్నాయి. దీంతో ఫస్ట్ డే ఏపీ లో రికార్డు వసూళ్లు ఫస్ట్ డే కలెక్ట్ చేయడం ఖాయం అంటున్నారు.
మొదటి రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒక్క ఏపీ నుంచే 30-35 కోట్ల రూపాయల షేర్ రావొచ్చనేది ఓ అంచనా. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ముందు రోజు ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తే, ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఇది కాకుండా, మరికొన్ని సెంటర్లలో అనధికారికంగా రేట్లు పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. అప్పుడు వసూళ్లు ఇంకాస్త పెరుగుతాయి. ఇక నైజాం నుంచి తొలి రోజు 15-19 కోట్ల మధ్య షేర్ అంచనా వేస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 50 కోట్ల షేర్ రాబట్టడం ఈజీ అంటున్నారు. ఇక మిగతా భాషల్లో కలిపి మొదటి రోజు దేశ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టగలదని చెపుతున్నారు. మరి చూడాలి ఆర్ఆర్ఆర్ ఏంచేస్తుందో అని.