
ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..మార్చి 25 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కేవలం 16 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వెయ్యి కోట్లు క్రాస్ చేసిన భారతీయ చిత్రాల్లో రెండే ఉన్నాయి. అవి దంగల్, బాహుబలి 2.
ఇప్పుడు వాటి జాబితాలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. రూ. 1,000 కోట్లు దాటి వసూలు చేసిన మూడు చిత్రాల్లో రెండు సినిమాలు రాజమౌళి వే ఉండడం విశేషం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఆర్ఆర్ఆర్ రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా చాల థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సో టోటల్ కలెక్షన్లు వచ్చే సరికి ఆ రెండు చిత్రాలను ఆర్ఆర్ఆర్ వెనక్కి నెట్టేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.